![]() |
![]() |

'ఢీ-15' ఛాంపియన్స్ బ్యాటిల్ ప్రతీ వారం సరి కొత్తగా అలరిస్తోంది. నెక్స్ట్ వీక్ ఎపిసోడ్ ప్రోమో రీసెంట్ గా రిలీజ్ అయ్యింది. ఇందులో ఆది కామెడీ మాములుగా లేదు. ఆది, జెస్సి ఇద్దరూ చాప, దుప్పటి తెచ్చుకుని ఢీ స్టేజి మీద పరుచుకుని పడుకుంటారు.. ఇంతలో ఆది పక్కింట్లో ఉండే కో-యాక్టర్ కూడా ఇంట్లో స్పేస్ లేక స్టేజి మీద పడుకోవడానికి వస్తుంది. "రండి రండి.. మాకూ అదే కావాలి" అని ఆది అనేసరికి "నేను మీకు కిలోమీటర్ దూరంలో పడుకుంటాను" అంది ఆ అమ్మాయి. "మాకు నిద్రలో కిలోమీటర్ పాకే అలవాటు ఉంది" అని పంచ్ వేసాడు ఆది.
తర్వాత "ఆది గారు చెప్పడం మర్చిపోయాను.. నిన్న జెస్సి నాకు ప్రపోజ్ చేసి గుర్తుగా తాడు కూడా ఇచ్చాడు" అని సిగ్గుపడుతూ చెప్పింది. "నా మొలతాడు దానికి ఇచ్చావా నువ్వు" అని జెస్సీతో ఆది అనేసరికి అందరూ నవ్వేశారు.
ఇంతలో జెస్సి "ఆది అన్నా నాకు నిద్ర రావట్లేదు.. ఏదైనా కథ చెప్పు" అన్నాడు. "అనగనగ ఢీ 15 అనే సీజన్ ఆరు నెలలంట. కొత్తగా టీమ్ లీడర్లంటా.. వాళ్ళు రిజిస్టర్ అవడానికి పది నెలలు పడుతుందట" అని చెప్పాడు ఆది. "వద్దన్నా..చాలు" అని జెస్సి నిద్రపోయాడు. "కథలు కావాలంట ఎదవకి" అని జెస్సి మీద పంచ్ వేశాడు ఆది.
![]() |
![]() |